చూడరే గొల్గొత గిరి – చేరరే కలువరి దరి

చూడరే గొల్గొత గిరి – చేరరే కలువరి దరి

యేసు శ్రమల వేదన – పాపికొరకు రోదన

సిలువపైన దైవసుతుని మరణ యాతన

 

1. లేత మొక్కవలెను యేసయ్య పెరిగెను

సురూపము సొగసతనికి లేకపోయెను

ఛెళ్ళుమన్న కొరడాలు – ఒడలంతా గాయాలు

ఆ దెబ్బలలో మనకు స్వస్థత కలిగెన్

 

2. బాధింపబడినను మౌనియాయెను

అన్యాయపు తీర్పునొంది దోషియాయెను

పక్కలో దిగె బళ్ళెం – తలకు ముండ్ల మకుటం

మనయందరి దోషమును ఆయనే మోసెన్