చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు

చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు (2)

నీ పేరు మిటో ఎరుగనయ్యా (2)

నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2)          ||చూచుచున్న||

 

శారాయి మాటలే విన్నాను

అబ్రహాము భార్యనై య్యాను (2)

ఈ అరణ్య దారిలో ఒంటరినై (2)

దిక్కులేక తిరుగుతున్న హాగరును

నేను హాగరును        ||చూచుచున్న||

 

ఇష్మాయేలుకు తల్లినైతిని

అయినవారితో త్రోసివేయబడితిని (2)

కన్నకొడుకు మరణము చూడలేక (2)

తల్లడిల్లిపోతున్న తల్లిని నేను

అనాథ తల్లిని నేను       ||చూచుచున్న||

 

పసివాడి మొరను ఆలకించావు

జీవజలములనిచ్చి బ్రతికించావు (2)

నీ సంతతిని దీవింతునని (2)

వాగ్దానమిచ్చిన దేవుడవు

గొప్ప దేవుడవు          ||చూచుచున్న||