చూచుచున్నాము నీ వైపు

చూచుచున్నాము నీ వైపు

మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు

చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను

జాచుచు గరములు చక్కగా నీవైపు        ||చూచు||

 

మేమరులమై యుంటిమి

మార్గము వీడి మేమందరము పోతిమి

ప్రేమచే నప్పుడు ప్రియ తనయు నంపించి

క్షేమ మార్గము మాకు బ్రేమను జూపితివి          ||చూచు||

 

నిను నమ్ము పాపులకు

వారెవరైనా నీ శరము జొచ్చువారలకు

ఇనుడవు కేడెంబు నీ జగతిలో నగుచు

గనుపరచుచుందువు ఘనమైన నీ కృప         ||చూచు||

 

నీ భయము మాయెదలను

నిలుపుము నీదు ప్రాభవ మొనరంగను

నీ భయముచే మేము వైభవ మొందుచు

నే భయము లేకుండ నీ భువిని గొన్నాళ్ళు         ||చూచు||

 

దయ జూచి మము నెప్పుడు

మంచివి యన్ని దయచేయు మెల్లప్పుడు

దయచేయరానివి దయచేయుమని కోర

 

దయ జూపి మన్నించు దయగల మా తండ్రి        ||చూచు||