చిరునగవు మోముతోడ-భవ దివ్య భజన సేయ

చిరునగవు మోముతోడ-భవ దివ్య భజన సేయ

శుద్ధ హ్రుదయమే చిహ్నము పరముకు

నూతన శ్రుష్టికి చరితము

చరణమే శరణము ముఖముకు “చిరునగవు””

1. త్రుణప్రాయ జీవితము నిలువెల్ల విషమయము-

విడుదల కానరాదు జన్మ కర్మ ధర్మముతో “2″

నరరూప ధారిగా ఏకైక సుతునిగ పరము వీడి-

అల నరుల కొరకు ఇల కురిసె కరుణ రుధిరం   “చిరునగవు”

2. ఇరుకైన ఈ గమనం విశ్వాసయానం-

త్రోవ విశాలం నరకమే అంతం “2″

రక్షణ వెదకినా పాపము వీడిన-తీర్చు చెంతకు

నొసగు వరములు తెరచు పరము మనకు   “చిరునగవు