చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య

చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య

చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)

దయగల వాడమ్మో

ఈ జగమున లేనే లేడమ్మో (2)       ||చిత్ర||

 

రాయి రప్పకు మొక్కవద్దు

చెట్టు పుట్టను కొలవవద్దు (2)

దయగల వాడమ్మో

ఈ జగమున లేనే లేడమ్మో (2)       ||చిత్ర||

 

లోకమునకు వచ్చినాడు

పాపుల రక్షించుటకు (2)

పరిశుద్దుడొచ్చినాడు

ఆ పరమున చేర్చుతాడు (2)           ||చిత్ర||

 

కోళ్ళు గొర్లు కోరడట

కొబ్బరికాయలు కోరడట (2)

దయగల వాడమ్మో

 

ఈ జగమున లేనే లేడమ్మో (2)        ||చిత్ర||