చింతెందుకు నీకు దిగులెందుకు

చింతెందుకు మీకు దిగులెందుకు

మన తాతయ్య లేరని బాధెందుకు (2)

కష్టాలు లేని కన్నీళ్లు లేని

పరదైసులోన తానుండగా (2)        ||చింతెందుకు||

 

శాశ్వతము కాదు ఈ లోకము

మన గమ్యస్థానము పరలోకము (2)

ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు

తప్పక ఈ భువిని వీడాలిగా (2)       ||చింతెందుకు||

 

ఒకరోజు తాతయ్యను చూస్తామనే

నిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2)

ఆ రోజు వరకు పరదైసులోన

 

అబ్రహాము చెంతన తానుండగా (2)      ||చింతెందుకు||