చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను

చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను

వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక యుండెను

అ.ప. : ఓ చిన్నితనయా – నీకిన్ని శ్రమలేలనయా

నీ తండ్రి ప్రేమను గనవా – నీ యింటికే తిరిగి రావా

 

1. పనివారు సయితం నీ తండ్రి ఇంట

రుచియైున అన్నం తినుచుండగా

కనికరము చూపే వారెవరు లేక

శుచిలేని పొట్టుకై ఆశింతువా

 

2. నీ క్షేమమును కోరు నీ తండ్రినొదిలి

ఆ క్షామ దేశమున జీవింతువా

విస్తార ఆస్తిపై అధికారమును విడిచి

కష్టాల బాటలో పయనింతువా

 

3. పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతునివై యుండి

పందులతో నీకు సహవాసమా

ఏర్పరచబడిన యువరాజువై యుండి

 

పనికిమాలినవారితో స్నేహమా