గోరంతలు కొండంతలుగా చేసి

గోరంతలు కొండంతలుగా చేసి

పరులార్జన నీ సొంతముగా చూపి

గప్పాలు కొట్టే పెద్దయ్యో – గొప్పలు చెప్పవద్దయ్యో

 

1. అన్నీఉన్న విస్తరి ఎపుడూ అణిగిమణిగి ఉంటుంది

ఖాళీగున్న పాత్రయే చాలా చప్పుడు చేస్తుంటుంది

మాటలింక తగ్గించాలి – చేతలలో చూపించాలి

నీ ఘనతను నువ్వుగాక నీ పనులే చాటించాలి

 

2. నిన్నుగూర్చి ఇతరులు చెపితే తెలుస్తుంది నీ మంచితనం

నీ మంచిని పరులు పొగిడితే పెరుగుతుంది నీదు గౌరవం

మృదుభాషణే అలంకారం – నోరు కాచుకుంటే శ్రేష్టం

చేతనైన మంచిపని చేస్తేనే ఆశీర్వాదం

 

3. చెప్పిందే చెయ్యాలంటూ యేసుక్రీస్తు బోధించాడు

చేసిందే చెప్పాలంటూ ఆచరించి చూపించాడు

గురునిబోధ పాటించాలి – అడుగులలో పయనించాలి

 

హెచ్చింపబడాలంటే తగ్గింపుతో జీవించాలి