గొల్లలారా కదలిరండి జ్ఞానులారా మిరు రండి

గొల్లలారా కదలిరండి జ్ఞానులారా మిరు రండి

దేవాది దేవుడు రాజాదిరాజు మన కొరకు జన్మించెను

సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మనకొరకు ఉదయించేను 

1.భువిలోన మానవాళి రక్షణకై పాపము బాపె విమోచకుడై

పరమువీడి వచ్చెనన్న పరిశుద్ద దేవుడన్న .

2.మనలోని చీకటిని బాపుటకై వెలుగును నింపే

జ్వోతియై పరమువీడి వచ్చెనన్న పరిశుద్ద దేవుడన్న

3.ప్రతివారిలో భయమును బాపుటకై సంతోషం సమాదాన మిచ్చుటకై

 

పరమువీడి వచ్చెనన్న పరిశుద్ద దేవుడన్న.