గొల్గోత కొండపై-ఘోర శిలువపై లోక పాపం మోసిన దేవ గొఱ్ఱెపిల్ల

గొల్గోత కొండపై-ఘోర శిలువపై లోక పాపం మోసిన దేవ గొఱ్ఱెపిల్ల

ఆహా ధ్యానింతుము ఆశిలువ విలువలు ఆహా ధ్యానింతుము ఆ పసిడి పలుకులు

 1 వీరలను క్షమించుమని-తండ్రిని వేడితివి

వీరేమి చేతురో-వీరెరుగరని-కరుణ చూపితివే

భాధించిన వారిని-క్షమిఇంచిన-దేవ గొఱ్ఱెపిల్ల ఆహా

 2 పరితపించిన దొంగను-చేర్చుకొంటివి

నేడు నీవు నాతో కూడా-పరదైశులో వుందువని

నిశ్చయముగా పలికినా-దేవగొఱ్ఱె పిల్ల        “ఆహా

 3 మానవ మాత్రు ప్రేమకు-మాదిరి చూపితివే

అమ్మా ఇదిగో నీ సుతుడని-అప్పగించితివే

కుమారునిగా ఆదరించిన- దేవ గొఱ్ఱెపిల్ల     “ఆహా

 4 దేవనా…దేన..నా చేయి-ఏలవిడిచితివి

ఏలీ..ఏలీ  లామా సభక్త అని-కేక వేసితివి

చిత్ర హింసను  ఓర్చినా- దేవ గొఱ్ఱెపిల్ల       “ఆహా

 5 జీవ జలపు ఊటగా-భువికి వచ్చితివి

దప్పిగొనిన వారికి-దప్పిక తీర్చితివి

జీవమియ్య దాహమనిన- దేవ గొఱ్ఱెపిల్ల     “ఆహా

 6 తండ్రి చిత్తము నెరవేర్చి-విధేయుడ వైతివి

అందరి విమోచనకై-బలియాగ మైతివి

సమాప్తమని పలికిన- దేవ గొఱ్ఱెపిల్ల         “ఆహా

 7 తండ్రీనీ చేతికి నాదు ఆత్మను

అప్పగించు చున్నానని ప్రాణము విడిచితివి

 

తండ్రి చెంతకు చేరినా- దేవ గొఱ్ఱెపిల్ల        “ఆహా