గెలవాలయ్యా నేను గెలవాలయ్యా

గెలవాలయ్యా నేను గెలవాలయ్యా

గెలిచి నే పరలోకం చేరాలయ్యా(2)

పిలిచి నీవిచ్చే నా బహుమానము(2)

పొంది నీ సన్నిధిలోనే ఉండాలయ్యా

1.అడ్డగించే సాతాను సహకరించే నీ దేహం

కనిపించే ప్రతి వస్తువును కాంక్షించే నేత్రమును

గెలిచే నే విజయం పొందాలయ్యా(2)

గెలిచి నే మాదిరి చూపాలయ్యా”గెల”

2.చెడగొట్టే స్నేహమును పడగొట్టే గర్వమును

బేధమెంచు మాటలను గర్వమిచ్చు పోకడను(2)

విడిచి నే విజయం పొందాలయ్యా

విడిచి నీ సాక్షిగా బ్రతకాలయ్యా”గెల