గెత్సేమనే తోటలో – ప్రార్ధింప నేర్పితివా ఆ ప్రార్దనే మాకునిలా

గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన

మానవాళి విడుదల కొరకైన ప్రార్థన

అ.ప. : నీ కోసమే – నా కోసమే

ఆ మరణ పాత్ర మన పాప ఫలితమే

 

1. ఘోరమైన శ్రమలెన్నో పొందాలని

కలువరి వరకు సిలువ మోయాలని

ఎరిగియుండి ఆ పాత్రను స్వీకరించెను

తన తండ్రి చిత్తమునకు తలవంచెను

 

2. కొంచెమైన మంచితనము లేని పాపిని

సంపూర్ణ స్వస్థతతో నింపాలని

గాయములు పొందుటకు సిద్దమాయెను

తన తండ్రి చిత్తమునకు తలవంచెను

 

3. క్షయమగు మనిషిని మహిమకు మార్చాలని

అక్షయమగు రాజ్యములో చేర్చాలని

మరణంపు ద్వారమున ప్రవేశించెను

 

తన తండ్రి చిత్తమునకు తలవంచెను