గురుతు చేసుకో ఓ ప్రియుడా

గురుతు చేసుకో ఓ ప్రియుడా

గుడిలో చేసిన ప్రమాణ సూత్రము

మరచిపోకుమా ఓ ప్రియతమా

మెడలో కట్టిన ఆ మంగళసూత్రం

తిరగబడితే క్రీస్తు కొరడా చెళ్ళుమంటుంది శుద్దీకరణ

1.స్వదేశీ సంస్కృతి మరిచి విదేశీ సంస్కృతి మరిచి

ఆత్మీయతను అణచి అనురాగాన్ని విడచి

పబ్ క్లబ్ ల తైతక్కలాడి కాముకత్వము తలకెక్కి

భార్యాభర్తల మార్పిడి చూడు

కుటుంబ వ్యవస్థ దోపిడి నేడు

2.సాటి సహాయము మరిచి సూటిపోటిగా పొడిచి

భర్తను అనుమానించి పిల్లల భవితను విడిచి

ఇంటిగుట్టును రట్టుగ చేసి భార్య నెదిరించి గడప దాటితే

పెళ్ళి కాస్త పెటాకులై కొంప కొల్లేరౌతుంది