గురి లేని నా జీవితాన-నా యేసు నాథా

గురి లేని నా జీవితాన-నా యేసు నాథా

నీవే నా గమ్యం-నీవే నా గానము-నా దాగు చోటు నీవే

1 పగలు మేఘ స్థంబమై-రాత్రి అగ్ని స్థంబమై-నీ ప్రజలను నీవే కాపడినావు

కలత చెందిన వేల-కన్నా తండ్రి నీవై-నన్నెంతగానో ఓదార్చినావు

కన్నీటిని నాట్యముగా-నీవు మార్చినావు

నిందకు బదులు-పూదండను నాకు ఇచ్చినావు

కడ దాకా నీ ప్రేమ చాటే-పని వానిగా నన్ను మార్చావు

2ఎదలో తీవ్రగాయమై-కృంగిన వేళలో-మధిలోన నీ ప్రేమ స్థాపించావు 

ఎండిన ఎడారి లాంటి నా హృదయసీమలో ఆరాధ్యదైవమై నీవు నిలచినావు

నా మీద నాకు నమ్మికను- పుట్టించినావయ్యా-

నాలోఉన్నబయమంతటిని-తొలగించినావయ్య

 

నిండు మనస్సుతో నీ పాట పాడే గాయకునిగా నన్ను మార్చినావు