గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము

గీతం గీతం జయ జయ గీతం

చేయి తట్టి పాడెదము (2)

యేసు రాజు లేచెను హల్లెలూయ

జయ మార్భటించెదము (2)       || గీతం||

 

చూడు సమాధిని మూసినరాయి

దొరలింపబడెను

అందు వేసిన ముద్ర కావలి నిల్చెను

దైవ సుతుని ముందు           || గీతం||

 

వలదు వలదు యేడువవలదు

వెళ్ళుడి గలిలయకు

తాను చెప్పిన విధమున తిరిగి లేచెను

పరుగిడి ప్రకటించుడి          || గీతం||

 

అన్న కయప వారల సభయు

అదరుచు పరుగిడిరి

ఇంక భూతగణముల ధ్వనిని వినుచు

వణకుచు భయపడిరి             || గీతం||

 

గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి

జయ వీరుడు రాగా

మీ మేళతాళ వాద్యముల్ బూర

 

లెత్తి ధ్వనించుడి          || గీతం||