గాఢాంధకారములో – నేను తిరిగినను

గాఢాంధకారములో – నేను తిరిగినను

నేనేల భయపడుదు- నా తోడు నీవుండగా

 

1.ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టిననూ

నిన్ను తలచినచో అన్ని విడనాడు (2)

అన్ని కాలముల నిన్నే స్మరియింతు (2)

ఎన్నరానివయా నీకున్న సుగుణములు ||గాఢాంధ||

 

2.నాకున్న మనుజులెల్ల – నిన్ను విడిచిననూ

నా దేవ ఎప్పుడైనా – నన్ను విడిచితివా (2)

నా హృదయ కలశమున – నిను నేను నిలిపెదను (2)

నీ పాద కమలముల – నా దేవ కొలిచెదను ||గాఢాంధ||

 

3.నా బ్రతుకు దినములలో నిన్నేల మరచెదను

నీ ఘన కార్యముల నేనెపుడు స్మరియింతు (2)

నీ ఉపకారముల నేనెపుడు తలచెదను (2)

 

నా యేసు పాదముల నేనిపుడు కొలిచెదను ||గాఢాంధ||