గాడాంధకారపు లోయలో

గాడాంధకారపు లోయలో

నే సంచరించిన వేళలో

అపాయమేమియు రానీయక

ఉన్నావు తోడుగ నా త్రోవలో (2)

యెహోవా నీవే నా కాపరివి

ఏమి లేమి లేక కాపాడితివి (2)

ఆరాధన ఆరాధనా

నా తండ్రి నీకే ఆరాధనా (4)          ||గాడాంధకారపు||

 

పచ్చిక గల చోట్లలో నిలిపావు

శాంతి జలములందు నన్ను నడిపావు (2)           ||యెహోవా||

 

నూనెతో నా తలను అంటావు

నా గిన్నెను పొర్లి పారజేసావు (2)           ||యెహోవా||

 

చీకటి బ్రతుకును వెలిగించావు

 

మరణపు భయమును తొలగించావు (2)         ||యెహోవా||