గళమెత్తి పాడినా – స్వరమాలపించినా

గళమెత్తి పాడినా – స్వరమాలపించినా

నీ గానమే – యేసూ నీ కోసమే

నీ ధ్యానమే – యేసూ నీ కోసమే

1. నశియించిపోయే నన్ను బ్రతికించినావే

కృశియించిపోయే నాలో వసియించినావే

నీ కార్యము వివరించెదన్ – నీ నామము హెచ్చించెదన్

నాకున్న సర్వమా – ఏకైక దైవమా

2. మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే

గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే

నీలో అతిశయించెదన్ – నీలో ఆనందించెదన్

నాకున్న సర్వమా – ఏకైక దైవమా

3. శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే

కృపచేత ఆపదనుండి విడిపించినావే

నీ నీతిని వర్ణించెదన్ – నీ ప్రేమను ప్రకటించెదన్

 

నాకున్న సర్వమా – ఏకైక దైవమా