గమ్యం చేరాలని నీతో ఉండాలని – పగలూ రేయి పరవశించాలని

గమ్యం చేరాలని నీతో ఉండాలని

పగలూ రేయి పరవశించాలని

ఈ నింగి నేలా కనుమరుగైనా

శాశ్వత జీవం పొందాలని

సాగిపోతున్నాను నిన్ను చూడాలని

నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2)       ||గమ్యం చేరాలని||

 

భువి అంతా తిరిగి జగమంతా నడచి

నీ జ్ఞానముకు స్పందించాలని

నాకున్నవన్ని సమస్తం వెచ్చించి

నీ ప్రేమ ఎంతో కొలవాలని

అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో

అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో         ||సాగిపోతున్నాను||

 

అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా

శిరమును వంచి సహించాలని

వేదన బాధలు గుండెను పిండినా

నీదు సిలువనే మోయాలని

నా గుండె కోవెలలోనా నిన్నే నే ప్రతిష్టించి

 

నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని       ||సాగిపోతున్నాను||