గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు

గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు

ఎందుకయ్య వెతుకులాట చచ్చేవరకూ(2)

సూర్యుడు వస్తే పువ్వు రాలిపోతుంది….

మరణం వస్తే నువ్వు రాలిపోవాలి…

పువ్వులా రాలిపోవాలి ..(గడ్డి)

1.నల్లని నీ తలలో తెల్లని వెంట్రుకలొచ్చి

గుర్తు చేస్తున్నాయి నీ వయసు నీ..

నీ సమయం ఆసన్నమయినదనీ(2)

ప్రాణం పోకాముందే ప్రభుని నమ్మితే

సమయంముండగానే రక్షణను పొందుకో(2) (గడ్డి)

2.అందరు నీ వారని అన్నీ నీవేనని

మోసపోతున్నారు ఓ సోదరా …

నీదసలీ లోకమే కాదురా….(2)

లోకాశల నుండీ దూరముగా పారిపో

 

పరిశుద్ధునిగా బ్రతికి ప్రభు చెంతకు చేరిపో(2)(గడ్డి)