గగనమంత వెలిగింది గొప్ప వెలుగులతో

గగనమంత వెలిగింది గొప్ప వెలుగులతో

భువి అంత పాడింది ప్రభు పాటలను   

క్రిస్మస్ ఇది క్రిస్మస్ క్రీస్తు ఆరాధన

క్రిస్మస్ నిజ క్రిస్మస్ క్రీస్తు ఆలాపనా

1.ఆకాశమందున తారలెన్నియున్నను ఈ తార వింతైనది వెలుగుచుండెను దారి చూపుచుండెనే జ్ఞానులను నడుపుచుండెనే యేసుపుట్టెను పశుల పాకలో బెత్లెహేముకు తరలి రండని ముందుగా ముందుగా నడచుచుండెనే  వింతైన తారక వెలసింది ఆ గగనాన ఇలలోన యేసుని చూపింది ఈ భువిలోన.

 

2.దూత తెల్పెను శుభవార్తను రక్షకుడు పుట్టాడని భయామేలను ఇక దిగులేలను చూడమీరు వెళ్ళాలని దావీదు పురమందున దయగల దేవుడు ఉదయించెను సంతోషం సంతోషం సంతోషమే ఆనందమానంద మానందమే పరలోక దూత తెలిపాడు ఒక శుభవార్త పరిశుద్దుడేసు పుట్టెనని ఈ ధరలోన.