క్రైస్తవ జీవితం -సౌభాగ్య జీవితం

క్రైస్తవ జీవితం -సౌభాగ్య జీవితం- ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం     

కష్టములు వచ్చిన -నష్టములు వచ్చిన -యేసు ప్రభువే నా సహకారి 

 

1.ఈ లోక ఘనత -నన్ను విడిచినన్ -లోకస్థులెల్లరు -నన్ను విడిచినన్.        

నా సహోదరులు -నన్ను విడిచినన్ – ఏసేపు దేవుడే -నా సహకారి.   

 

2 అంధకారంబు భువి -నావరించిన-రాజులు ఘనులు -శత్రువులైనను       

అగ్నిగుండములో- సింహపు గుహలో-దానియేల్ దేవుడే- నా సహకారి.    

 

3నా మంచి కాపరి- శ్రేష్ఠ స్నేహితుడు -శాశ్వత రాజు నా సహాయకుడు .               

భారం నాకెందుకు-వ్యాకులమెందుకు – ప్రభు ప్రజలతో-నే కీర్తించెదన్ 

       

4 బూర శబ్దంబు -మ్రోగేడి వేల -శ్రమలొందిన నా -ప్రభుని చూచెదన్      

 

ఏనాడో ఎపుడో- నీవు వచ్చెదవు -ఆనాటి వరకు- నే కనిపెట్టెదన్.