క్రైస్తవుడా …క్రీస్తు యేసు సైనికుడా…

క్రైస్తవుడా …క్రీస్తు యేసు సైనికుడా…(2)

యుధ్ధానికి వచ్చి నీవు ముద్దాయివైతే

జీవన వ్యాపారంలో చిక్కుకునిపోతే

ఓర్పులేని తీర్పుందని తెలుసుకో …

నేర్పుతో నీ బ్రతుకుని దిద్దుకో…(2) (క్రైస్తవ)

1.అబద్ధపు బోధలను ఖండించాలి

అపవాది సాతానుని ఎదిరించాలి(2)

కష్టనష్టాలకు కృంగిపోక ….శరీర కోర్కెలకు

లొంగిపోక… నిలబడితే నీదే విజయమూ…

ఎదురు కాదు ఎప్పటికీ అపజయమూ…(2)(క్రైస్తవుడా)

2. నీ ముందు ఉన్నదీ పోరాటమూ…

పోరడి వెళ్ళాలి పరలోకమూ..(2)

యోబు వల యెహోవా  గెలిపించాలి 

పౌలు  వలె సువార్తను ప్రకటించాలి (2)

అంతము వరకూ నీకు పోరటం

 

దేవుడిచ్చు జీవ కిరీటం(2)(క్రైస్తవు)