క్రైస్తవుండా కదలిరావయ్యా కలుషాత్ములకు ఈ సిలువశక్తిని

క్రైస్తవుండా కదలిరావయ్యా కలుషాత్ములకు ఈ సిలువశక్తిని

చాటవేమయ్యా ఎండ వానలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు ||2||

కండలను ప్రేమింతువేమయ్యా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా

1.వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు విని క్షుద్బోదగొని వాదించు చుండగను

మిషనులెల్ల మిషలచేత మిట్టపడుచు వాదములచే యేసు బోధను మరచినారన్నా

నీవెంత కాలము వారి చెంత వుందువోరన్నా ||క్రైస్తవుండా||

2.సత్య వాక్యము సంతలో దులిపి భోదకుల దొరల భత్యములపై భాంతులు నిలపి

చిత్తమగు అనుకూల బోధలు చేసి ప్రజల మోసగించే – సూత్రదారుల చేరరాదయ్య

సుఖ భోగమిడిచి సత్య వాక్యము చాటరావయ్యా ||క్రైస్తవుండా||

3.శక్తిహీనుడవందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా

భక్తిహీనత పారద్రోలి భష్ట మనసు బయలు పరచి

శక్తితో సువార్త చాటుదువు సువార్తచే జయమొంది ఆత్మల రక్షించెదవు ||క్రైస్తవుండా||

4.నీతికై భక్తాది పరులెల్లా – నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా

 కత్తిపోటులు రాళ్ళ దెబ్బలు కరుకుగల రంపములు కోతలు

బెత్తముల కొరడాల దెబ్బలు పైబడి చేర్చే దేహము వాలలాడెను రక్తము భూమిపై ||క్రైస్తవుండా||

5.దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సఖుడా ఖ్యాతిగా నీకిచ్చె గ్రంధంబు

ఖేతీయుల వినుము గ్రంధము తేనెవలె మధురముగా నుండును

జ్ఞానము నీకబ్బునో హితుడా జ్ఞానంబు నొంది స్వామిని సేవించుమో సఖుడా ||క్రైస్తవుండా||

6.ఆది సంఘము నార్పుటకునేంచి – ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి

ఆది క్రైస్తవ భక్తుల స్థంభముల గట్టి తారు పూసి అగ్నిని ముట్టించి కాల్వంగ –

 

ఆ సంఘమొచ్చె అధిపతి అప్పుడే నశియించే ||క్రైస్తవుండా||