క్రైస్తవమొక మతము కాదిది

క్రైస్తవమొక మతము కాదిది

యేసునందు తిరిగి జన్మము

క్రీస్తునందు తిరిగి జన్మము ||2||

 

ధరల తల్లి దానమొసగును

తన రక్తము ప్రతిజనలములో

అందరికి జీవమొసగెను

కలువరిలో యేసు రక్తము ||2||

కలువరిలో యేసు రక్తము                     ||క్రైస్తవమొక||

 

ఒక జన్మకు రెండు చావులు

ఇరు జన్మలకొక్క మరణమే ||2||

సిలువయందే నరకపు చావు

పొందెనేసు అందరికొరకు ||2||

పొందెనేసు అందరికొరకు                      ||క్రైస్తవమొక||

 

భువికి మూలమీ శరీరము

దివిని చేర ఆత్మ మూలము ||2||

మతము మార్గ జ్ఞానము వీడి

మరణ విజయుడేసు చేరుమా ||2||

 

మరణ విజయుడేసు చేరుమా               ||క్రైస్తవమొక||