కోతి నుండి మనిషి అసలే పుట్టలేడు

కోతి నుండి మనిషి అసలే పుట్టలేడు

మారి మారి ముసలికోతి మనిషి కాడు(2)

ఏమిటి విచిత్రం ఏమిటి ఈ చాదస్తం(2)

ఎటుబోతున్నది మనిషి జ్ఞానం(2)

1.ఆదిలో మనిషి కోతట – వానికో పొడవాటి తోకట అవ్వా(2)

రాను రాను తోకకేమో మాయరోగం పుట్టి(2)

అదికాస్త ఊడెనట ఊడి మనిషి ఆయేనట(2)”ఏమిటి”

2.ఆదిలో నాల్గుకాళ్ళట – రానురాను రెంటితో నడిచినట(2)

కిచకిచలు కాస్తమారి మాటలాడ సాగేనట(2)

మారి మనిషి ఆయేనట – మాటలాడ సాగేనట(2)”ఏమిటి”

3.ఆదిలో అడవి ఇల్లట – రాను రాను ఇండ్లనే కట్టేనట అవ్వా(2)

ఆనాటి వానరుడే ఈ నాటి నరుడట(2)

నగరీకుడాయేనట నగరాలు కట్టేనట(2)”ఏమిటి”

4.ఆదిలో నేల మంటితో నరుని నిర్మించెను దేవుడు అవును(2)

వాని నాసిక రాంధ్రములలో జీవవాయు వూదగ(2)

నరుడు బ్రతికి నిలిచెను జీవాత్మ ఆయెను(2)

ఇదిరా చిత్రం ముమ్మాటికి సత్యం(2)

ఇదిరా మానవుని జన్మ రహస్యం(2)

 

ఆధారమైనావులే జీవనాధారమైనావులే