కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును – రాగ భావాలతో నిన్నుధ్యానింతును

కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును – రాగ భావాలతో నిన్నుధ్యానింతును

గాత్రవీణ నే మీటి నేను పాడనా – స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా

1.రాగాల నేను కూర్చనా – స్తుతిగీత గానాలు నేపాడనా(2)

హృదయమే నీ ఆలయం – నాలోనవసియించు నాయేసువా”కోటి”

2. యాగంబునై నేను వేడనా – సనుతించు గీతాలు నే పాడనా (2)

జీవితం నీ కంకితం – స్తుతియాగమై నేను కీర్తించెదన్”కోటి”

3. సువార్త నేను చాటనా – నీ సాక్షిగా నేను జీవించనా (2)

 

ప్రాణార్పణముగా పోయ బడినా – నన్నిలలో నడిపించు నా యేసువా “కోటి”