కొండ కోన లోయలోతుల్లో… ఓ

కొండ కోన లోయలోతుల్లోఓ ఓ

వినబడుతుంది నా యేసుని స్వరమే

తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం

ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన ||

 

నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు

హృదయమందు చేర్చుకో నేస్తమా (2)

ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య

నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)

నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     ||కొండ కోన ||

 

ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు

నిన్ను రక్షించాలని (2)

కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య

తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)

 

నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     ||కొండ కోన ||