కృప కనికరముల- మా దేవా – కృతజ్ఞతనర్పింతు

కృప కనికరముల- మా దేవా – కృతజ్ఞతనర్పింతు

1.యెహోవా చేసిన – ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును?

యెహోవా నామమున- ప్రార్థన జేసెదను రక్షణ పాత్రచేబూని (కృప)

2. యెహొవాకు నా – మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను

యెహోవా ప్రజలలో-యెరూషలేములో ఎల్లప్పుడు స్తుతించు(కృప)

3.తల్లి గర్భమున – రూపింపబడక మునుపే నన్ను- ఎరిగితివి

తల్లి గర్భమునుండి -బయలుపడకముందే ప్రతిష్ఠించితివి (కృప)

4.  పూర్ణ మనస్సుతో- నన్ను వెదకి నన్ను కనుగొందురంటివి

కరుణతో నీవే- నన్ను వెదకి రక్షించితివి ప్రభువా(కృప)

5. దూషకుడను- హింసకుడను హానికరుడనై యుంటిని

దాసునిగా నన్ను- జేసికొంటివి దోషముల  బాపి (కృప)

6. ఇది నీకొరకై- విరువబడిన నా శరీరమనియంటివి

ఇది నీ పాప- క్షమకొరకై చిందిన రక్తమంటివి(కృప)

7.నీదు కృపతో- నాదు యేసు నన్ను నీవు- రక్షంచితివి

కాదునాదు – క్రియలవలన ఇది దేవుని వరమే(కృప)

8.చెప్పనశక్యము -మహిమా యుక్తము నీవొసంగిన-సంతోషము

 

తప్పకుండ హల్లెలూయ పాటపాడెదన్(కృప)