కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్య

కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్య-నిన్ను పాడి పొగడెదనయ్య నజరేయుడా…

అ.ప.: నజరేయుడా…నా గలలీయుడా….నజరేయుడా…నా గలలీయుడా….

నజరేయుడా…నాదు గలలీయుడా..                 “కృపా”

1. వాక్య ప్రణవ రూపమా దివ్యలోక తేజమా-దివి వీడి భువికరుదెంచిన మహిమ రూపమా “2″

దినమెల్ల పాడిన వేనొళ్ళ పొగడినా-నా ఆశతీరదు నా దైవమా  “2”      “నజరే”

2. ఆత్యున్నత శిఖరముపై ఆరాధ్యుడవు నీవు-ఆశతీర నిన్ను కొలిచెదను ఆత్మ రూపుడా “2″

ఆదరణ కర్తనీవై నన్నాదరించినావు-ఆత్మభిషెకముతో బలపరిచినావు  “2”   “నజరే”

3. నిత్యుడైన దేవుడవు నీతీ-స్వరూపుడవు-నిన్న నేడు ఏకరీతిగ ఉన్నవాడవు “2″

 

నీ ప్రేమ చాటగ మనసార పాడగా-నా భాష చాలదు నా దైవమా  “2”     “నజరే”