కృపా సత్య సంపూర్ణుడా

కృపా సత్య సంపూర్ణుడా –1సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా 2

నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా … మహనీయుడవు నీవేనయా …

1.ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా    

దాటిరే నీ జనులు బహు క్షేమముగా –2  (కృపా సత్య సంపూర్ణుడా)

ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే –2           

2. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా    

నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా –2   

నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే 2 (కృపా సత్య)

3. నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా    

నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా –2   

 

నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ  మారిపోయెనే-2(కృపా సత్య)