కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచూ

కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచూ

నీ మందిరములో ప్రవేశింతును

కీర్తనీయుడా లోకమే నను పిలిచినా నేను వెనుకకే చూడను..

1.నీ వాక్యమే నాలో సమృద్ధిగా – నివసింపజేసి నడిపించావు

నడుము కట్టి పోరాడెదను – దీపము వెలిగించి కనిపెట్టెదను

కీర్తనీయుడా లోకమే నను పిలిచినా నేను వెనుకకే చూడను…

2.పరలోక తండ్రి సంబంధిగా – ఆత్మానుబంధము నాకిచ్చినావు

తేజోవాసుల స్వాస్థ్యములో – పాలివానిగా నను చేసినావు

కీర్తనీయుడా లోకమే నను పిలిచినా నేను వెనుకకే చూడను…

3.యెహోవా నిస్సీవై అపజయములో – జయధ్వజము నాతో నిలబెట్టినావు

అక్కరలన్నియు తీర్చినావు -రెక్కల నీడకు నను చేర్చినావు

కీర్తనీయుడా లోకమే నను పిలిచినా నేను వెనుకకే చూడను..