కుల పిచ్చోడ్ని నేను – కళ్ళులేని కభోదిని

కుల పిచ్చోడ్ని నేను – కళ్ళులేని కభోదిని

మత ముచ్చోడ్ని నేను – మతేలేని ఉన్మాదిని

ప్రభుదేవా.. పరలోకరాజా – నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా

1.నా కులం నా కళ్ళు పొడిచిందిలే – నా మతం నా మనసు విరిచిందిలే

కులమొక కల్పనయే – మతమొక మతిభ్రమయే

కుల వెలి, మత బలి – మోసం మోసమేలే

2.నా అంశం నా కులం తప్పిందిలే – నా వంశం నా మతం మరిచిందిలే

పుట్టుకలో లేని కులం – బ్రతుకులో ఎందుకులే

మరణంలో రాని మతం – మోక్షంలో లేదులే

కుల పిచ్చోడ్ని నేను – కళ్ళులేని కభోదిని

మత ముచ్చోడ్ని నేను – మతేలేని ఉన్మాదిని

 

ప్రభుదేవా.. పరలోకరాజా – నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా