కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన

కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన

నాలో కలిగె సందడి – నాలో కదిలె సవ్వడి

హృదాయాలు స్పందించె వేళ – ఈ వేళ

 

1. కోయిలమ్మ పాడె కమ్మనైన ఏదో రాగం

దాగెనమ్మ సిగ్గు దొంతరల్లో ఏదో భావం

ఒంటరి జీవితం జంటగ మార్చెనే

ఇరు హృదయాలను ఒటికిగ కూర్చెనే

దేవుడే కలిపిన బంధం – వీడిపోని అనుబంధం

 

2. గోరుమామిడమ్మ పూచెనమ్మ అనురాగం

మరువకూడదమ్మ చేసుకున్న ఈ ప్రమాణం

వాక్యపు వెలుగులో బ్రతుకులు పండగా

దేవుడు తోడుగ మీతో నుండగా

సాగేటిఈ బంధం – వీగిపోని అనుబంధం