కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి

జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా

ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా

1.పనికిరాని పాత్రనని పారవేయకుమా

పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా ॥2

సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండ

సాక్షిగానుండు పాత్రగజేసి సత్యముతో నింపుము తండ్రి

ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి                    కుమ్మరి॥

2.విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు

వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగజేసి ॥2

ఆటంకములనుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా

పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా

ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా                            కుమ్మరి॥

3లోకాశతో నిండి ఉప్పొంగుచూ మార్గంబు నే దప్పితిన్

మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని ॥2

పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నను పట్టితివి

ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టితిన్

 

ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్                            కుమ్మరి॥