కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో

కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో

ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ॥2||         కుతూహలం॥

1.పాపమంత పోయెను రోగమంత పోయెను యేసుని రక్తములో

క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ

పరిశుద్ధ ఆత్మలో ॥2||                  కుతూహలం ॥

2.దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే

ఆత్మయైన దేవుడు మన సొంతమాయెను

ఆశ్చర్యమాశ్చర్యమే ॥2||               కుతూహలం॥

3.శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు

జయంపై జయం ఇచ్చును

ఏకముగా కూడి హోసన్నా పాడి

 

ఊరంతా చాటెదము                       కుతూహలం॥