కీర్తింతు నీ నామమున్

కీర్తింతు నీ నామమున్

నా ప్రభువాసన్నుతింతు నీ నామమున్ (2)

మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో (2)

నిను నే కొనియాడెదన్ (4)         ||కీర్తింతు||

 

ప్రతి ఉదయం నీ స్తుతి గానం

దినమంతయు నీ ధ్యానం (2)

ప్రతి కార్యం నీ మహిమార్ధం (2)

సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2)          ||కీర్తింతు||

 

నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ

వేలాది స్తుతులన్ చెల్లిస్తూ (2)

ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ (2)

నిన్నే నేను ఆరాధిస్తూ (2)          ||కీర్తింతు||

 

అమూల్యమైనది నీ నామం

ఇలలో శ్రేష్టమైనది నీ నామం (2)

ఉన్నతమైనది నీ నామం (2)

 

నాకై నిలచిన మోక్ష మార్గం (2)          ||కీర్తింతు||