కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి

కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి

రావాలి రావాలి నీలో గొప్ప మార్పు రావాలి

చేరాలి చేరాలి ప్రతిపాపి యేసును చేరాలి

వంగాలి వంగాలి ప్రతి మోకాలు వంగాలి

1.పాడాలి పాడాలి రక్షణ గీతం పాడాలి

చాటాలి చాటాలి యేసు వార్తను చాటాలి

నమ్మాలి నమ్మాలి రాక్షకుడేసుని నమ్మాలి

పొందాలి పొందాలి పరిశుద్దాత్మను పొందాలి

పరిశుద్దాత్మయే మా ఆయుధం పరిశుద్ధ గ్రంధం మా ఆధారం

పరిశుద్దాత్ముడే మాకు బలం మాకు బలం మాకు బలం

2.నిలవాలి నిలవాలి క్రీస్తుకు సాక్షిగా నిలవాలి

త్రొక్కాలి త్రొక్కాలి సాతానును అణగద్రొక్కాలి

మారాలి మారాలి ప్రభుక్రీస్తు రూపులో మారాలి

చూడాలి చూడాలి దేవుని రాజ్యం చూడాలి

పరిశుద్దాత్మయే మా ఆయుధం పరిశుద్ధ గ్రంథం మా ఆధారం

 

పరిశుద్దాత్ముడే మాకు బలం మాకు బలం మాకు బలం