కానాపురంబులో గడు వింతగా నీరు జానుగా ద్రాక్షారసమును జేసి

కానాపురంబులో గడు వింతగా నీరు జానుగా ద్రాక్షారసమును జేసి

పానముగ పెండ్లిలో బాగుగా నిచ్చిన దీనరక్షక పెండ్లి దీవించుమీ

అ.ప. : జయజయమంగళం – నిత్యశుభమంగళం

 

1. రావయ్య పెండ్లికి రయముగానో యేసు ఈవులియ్యగ వచ్చు హితుని బోలి

కావుమీ ద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యంబు బాపి యిపుడు

 

2. దయనుంచుమయ్య యీ దంపతుల మీదా సదయుడవై కాపాడు తండ్రివలెను

నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండగ బ్రతుకనిమ్ము

 

3. ఒప్పుమీరగ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన నిడికొనుచును

దప్పకుండగ దాని నిప్పుడమిలోనెపుడు గొప్పగా నెరవేర్ప గూడనుండు

 

4. చక్కగా నెగిడింప సంసార భారంబు ఎక్కువగు నీయాత్మ నిపుడొసంగి

నిక్కమగు సరణిలో ఎక్కువగ నడిపించి క్రక్కునను దీవించు కరుణానిధీ

 

5. పిల్లలను నీ వొసగ బ్రియముతో నోదేవ పెల్లుగా బోధింప వెరవుజూపు

 

మెల్లవేళలలోన నిరుకుమార్గము నందు జల్లగ నడిపింప శక్తినిమ్ము