కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం

కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం

ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం

శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం

రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా||

 

చెదరిన మనసులకూ శాంతి

కృంగిన హృదికీ ఓదార్పు

మృత్యు దేహముకూ జీవం

బలహీనులకు ఆరోగ్యం (2)

పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు

గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు

మోసపూరిత ఈ లోకంలో

ఏ వైద్యునికి సాధ్యము (2)           ||కవులకైనా||

 

క్షణికమైన అనురాగాలు

ఆవిరివంటి ఆప్యాయతలు

అవసరాల అభిమానాలు

నిలచిపోయే అనుబంధాలు (2)

నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ

ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం

స్వార్ధపూరిత ఈ లోకంలో

 

ఏ మిత్రునికి సాధ్యము (2)          ||కవులకైనా||