కళ్ళు తెరిస్తే వెలుగురా – కళ్ళు మూస్తే చీకటిరా

కళ్ళు తెరిస్తే వెలుగురా – కళ్ళు మూస్తే చీకటిరా

నోరు తెరిస్తే శబ్దమురా – నోరు మూస్తే నిశ్శబ్దమురా

ఏక్షణమో తెలియదు జీవిత అంతము

ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం

1.ఊయల ఊగితే జోలపాటరా – ఊయల ఆగితే ఏడుపు పాటరా

ఊపిరి ఆడితే ఊగిసలాటరా – ఊపిరి ఆగితే సమాధి తోటరా”ఏక్షణమో”

2.బంగారు ఊయల ఊగిన నీవు – భుజముల పైన నిన్ను మోయక తప్పదురా

 

పట్టు పరుపుపైన పొర్లిన నీవు – మట్టి పరుపు పైన నిన్ను పెట్టక తప్పదురా”ఏక్షణమో”