కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు

కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు

ఇక నీవు కలత చెందకు

నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా

ఇక అవి ఉండబోవుగా

యేసే నీ రక్షణ యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||

 

హోరు గాలులు వీచగా తుఫానులు చెలరేగగా

మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)

యేసే నీ నావికా భయము చెందకు నీవిక

యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||

 

కరువు ఖడ్గములొచ్చినా నింద వేదన చుట్టినా

లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)

యేసే నీ రక్షకా దిగులు చెందకు నీవిక

 

యేసే విమోచకా సంతసించుము నీవిక ||కళ్ళల్లో||