కల్వరి స్వరము నీ కొరకే

కల్వరి స్వరము నీ కొరకే

సుమధుర స్వరము మన కొరకే

మరి ఆలకించుమా  ప్రభు స్వరము ప్రియ స్వరము

సా..గరిగ ..సాని ..పా మా గమపా

1.సత్యము తెలియని  గమ్యము దొరకని వారికేగా కల్వరి స్వరము

శాంతిలేకటు బ్రతకలేకిటు అల్లాడుచున్న  వారికి స్వరము

ఆశల వలలో నిరాశల వలలో 2

చిక్కిన వారికి కల్వరి స్వరము చిక్కిన వారికి ప్రభుని స్వరము

2.గాలి తుఫానులో  చెదరిన వారిని  దరికి  చేర్చును కల్వరి స్వరము

చితికిన బ్రతుకును పగిలిన గుండెను

ఆదరించును ప్రియుని స్వరము

దాహము గొనినా వారల కెల్లా…

సేద తీర్చును కల్వరి స్వరము సేద తీర్చును ప్రభుని స్వరము

 

3.మార్పును కోరక తీర్పును తలచక  తిరుగు వారికి కల్వరి స్వరము

పైకి భక్తితో లోపల రక్తితో  బ్రతుకు వారికి కల్వరి స్వరము

వేడిగ లేక చల్లగ లేక…2

 

నులి వెచ్చగుండే వారికి స్వరము నులివెచ్చగుండే వారికి స్వరము