కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది – సర్వలోకానికి

కల్వరి స్వరము వినిపించుచున్నది – ప్రతీ పట్టణానికి

రమ్ము ప్రియుడా రమ్ము – క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు

లెమ్ము తెజరిల్లుమయా – క్రీస్తు వార్తను ప్రకటించుటకు – ఈ సువార్తను ప్రకటించుటకు

1. చూడుము భూమి కంపించుచున్నది – చీకటి జనములను కమ్ముచున్నది – 2

ఎందాక ప్రకటించుట మానెదవు – ఎందాక ఆలస్యం చేసెదవు – 2

ప్రభు త్యాగమునే మరిచెదవా – ప్రభు సేవనే విడిచెదవా ? – 2

రమ్ము ప్రియుడా రమ్ము – క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు

లెమ్ము తెజరిల్లుమయా – క్రీస్తు వార్తను ప్రకటించుటకు – ఈ సువార్తను ప్రకటించుటకు

2.పాపపు ఊభిలో ప్రజలుండగా – సాతాను సంకెళ్లతో బంధించగా – 2

ఎందాక పోరాటం మానెదవు – ఎందాక నిర్లక్ష్యం చేసెదవు – 2