కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు

పలు బాధలొందెను ఘోరబాధలు పొందెను (2)

నీ కోసమే అది నా కోసమే (2)

1.ప్రతివానికి రూపు నిచ్చె అతనికి రూపు లేదు (2)

పదివేలలో అతిప్రియుడు – పరిహాసములనొందినాడు (2) ॥నీ కోసమే॥

2.వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు (2)

దూషించు వారిని చూచి – దీవించి క్షమియించె చూడు (2) ॥నీ కోసమే॥

3.సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి (2)

 

సజీవుడై లేచినాడు – స్వర్గాన నిను చేర్చినాడు (2) ॥నీ కోసమే॥