కల్లుండి చూడలేని ఎందరో ఉన్నారు

కల్లుండి చూడలేని ఎందరో ఉన్నారు

చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2)

వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే

జీవింప చేయాలి నీ మహిమలోనే      ||కల్లుండి||

 

కంటి చూపుతో నన్ను కాచియున్నావు

గుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2)

మరణాన్ని తప్పించావు

జీవాన్ని నాకిచ్చావు (2)

ఇంకేల నా యేసయ్యా          ||కల్లుండి||

 

నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు

నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2)

నీవే నా గమ్యమని

నీలోనే నడిచెదను (2)

 

నాకేగా పరలోకము      ||కల్లుండి||