కలువరిగిరిలో సిలువధారియై

కలువరిగిరిలో సిలువధారియై

వ్రేలాడితివా నా యేసయ్యా (2)

 

అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను

ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)

నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా

నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2)            ||కలువరిగిరిలో||

 

దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను

ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)

ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి

 

నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2)                ||కలువరిగిరిలో||