కరుణించినావా కలుషాత్ముని

కరుణించినావా కలుషాత్ముని

క్షమియించినావా పాపాత్ముని ఈ దీనుని కడుహీనుని

 

1. మలినమైనది నా బ్రతుకు – పనికిరానిది నీ సేవకు

బలి చేసితి నిను సిల్వకు – నా పాపములకొరకు

 

2. మోడువారిన ఈ జీవితం – సిలువనీడన ఫలభరితం

చాట్టిపనిలలో నీ చరితం – నా జన్మకు నిజఫలితం

 

3. నీ ప్రేమకై నేనేమిత్తును – నీ పూజకై ఏమి సమర్పింతును

 

నలిగిన నా హృదయం నీకిత్తును – నా స్తుతులనర్పింతును