కరుణామయుని కడవరి పిలుపు

కరుణామయుని కడవరి పిలుపు

కృపాకాలపు ఆఖరి మలుపు

తెరువు నీదు హృదయపు తలుపు

యేసుక్రీస్తుని మదిలో నిలుపు

నీకిదే మేలుకొలుపు – నీకిదే మేలుకొలుపు

 

1. మరియ తనయగా గొరియ పిల్లగా మొదటిసారి భువికొచ్చెను

నరుల పాపము మరణశాపము సిలువపై తను మోసెను

హింసించువారిని క్షమియించెను-దూషించుచున్నను భరియించెను

పరిశుద్ధ రక్తము చిందించెను – పాప క్షమాపణ కలిగించెను

ప్రాణము విడిచి మరణము గెలిచి రక్షణ సిద్ధము చేసెను

 

2. జనులందరికి న్యాయము తీర్చను తీర్పరియై

తన గొర్రెలకు బహుమానమివ్వను ప్రధాన కాపరియై

కడవరి బూర నాదముతో – వేల దూతల సమూహముతో

ఉగ్రుడై – ప్రళయ కాలరుద్రుడై

సప్త నక్షత్రధారుడై – మహా తేజస్సుతో భానుడై

యూదాగోత్రపు సింహముగా ప్రభువు వేంచేయు వేళ

సమాధులన్నీ తెరువబడి మృతులు లేచేటి వేళ

ప్రియ యేసుని సంధింతువా – విడిచిపెట్టబడి రోదింతువా

 

ఇదియే రక్షణ దినం – అర్పించు యేసుకు జీవితం