కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని

కమ్మని బహుకమ్మని చల్లని అతి చల్లని

తెల్లని తేట తెల్లని యేసు నీ ప్రేమామృతం (2)

జుంటె తేనె కన్న మధురం సర్వ జనులకు సుకృతం (2)

యేసు నీ ప్రేమామృతం (2)        ||కమ్మని||

 

ఆశ చూపెను ఈ లోకం మలినమాయెను నా జీవితం

యేసూ నీదు ప్రేమ దయ చూపెను ఈ దీనురాలి పైన (2)

వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2)

కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2)        ||కమ్మని||

 

నా కురులతో పరిమళమ్ములతో చేసెద నీదు పాద సేవ

నా గుండె గుడిలో కొలువైయున్న నీకు చేసెద నేను మధుర సేవ (2)

ఆరాధింతును నిన్ను అనుదినము (2)

 

జీవింతును నీకై అనుక్షణము (2)        ||కమ్మని||